8/7/09
ఒక తార గెలుపు
తెరిపార చూశానోసారి, తళుకుమన్న తారల్ని,
తప్పదనుకున్నాను, తెర వెనుక ఉన్నవాణ్ణి కాస్తా
తెగించి బైటకొచ్చాను
ఓ చిన్న వెలుగు వెనుకెన్నెన్ని మంటలో
ఊహించగలిగినా ఒప్పుకోని మనసు
నా వెలుగు కూడా నన్ను వెతుక్కోమంది
తప్పొప్పుల నడుమ తలుపుల్ని తర్కంతో బద్దలుకొట్టి
తుఫాను గాలిలా నేను దూసుకెళ్ళాను, తారనయ్యాను.
అంతెత్తు నుండి మరుగుజ్జు ప్రపంచాన్ని చూసి నవ్వుకున్నాను.
పాతబడిన కొద్దీ విచ్చుకున్న నవ్వు వాడిపోయింది,
చుట్టూ చూశాను, మంటలే కనిపించాయి, దిక్కు తోచలేదు !
అందరిలానే ఉన్నా, ఉన్నచోటే ఒంటరిగా
ఆశగా చూస్తున్నాను నేల వైపు,
అక్కడ్నించే కాలు మోపుదామని !
కుదరదని తెలిసీ మొగ్గలేయించే మనసు,
అదే జరగని నాడు తనే చెబుతుంది,
ఆ రోజు నిజంగా మళ్ళీ నవ్వుతూ,
ఆనందంగా రాలిపోతాను, కనుమరుగౌతాను !
Posted by
వేమన
వర్గాలు:
కవిత్వం
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
బాగుందండీ :)
బాగుంది :)
బాగుందండీ!!
@ చిన్నా, విశ్వ ప్రేమికుడు , పద్మార్పితగారు
అందరికీ ధన్యవాదాలు. నే రాసింది మీ అందరికీ నచ్చినందుకు సంతోషం.
Anna..too much rasavu.
@ Alexander - Thanks buddy :)
Dude babu..by the way Sandrokottos means Chandragupta Mourya in Latin.
ఐతే ఓకే,
నువ్వు చంద్రగుప్త మౌర్య, నేను Alexander :)
wow..
బాగా రాస్తున్నారండీ!
కొత్తపాళీగారూ,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
Post a Comment