1/4/10

తలొంచుకుందాం

తలొంచుకుందాం
తెలివి లేని వాళ్ళమని
తెలుగు నేలపై కలియుగాన
యదు కులం మనమని

దురాశే తన శ్వాసై
పర ధర్మం
పడగలు సారించిన
వేళ
మునుపటి ప్రతి గాయం
మేనిపై మాసిపోక ముందే
రక్తపు రుచి మరిగిన
రాబందులు
ప్రజలు రెచ్చగ
పెట్టిన చిచ్చుల
మరొక్క గాయం
చుట్టూ మూగిన
ఈగలను, పురుగులను చూసి... తలొంచుకుందాం.

మృగరాజు నాటి
ఆ అడవి నీతే
మేలనిపించే రీతిన
గొర్రెల మందల పీడించే
ఈ నక్కల ఎత్తులు జిత్తులు చూస్తూ
చేవ ఉండీ చలనం చూపని
మన నిబ్బరానికి అబ్బురపడక... తలొంచుకుందాం.

తలొంచుకుందాం
తెగువ లేని వాళ్ళమని
ప్రజాస్వామ్య వస్త్రాపహరణాన
ప్రతి నాయకుడూ దుశ్శాసనుడైతే`
ధర్మం తప్పిన
ధర్మజులం మనమని
చోద్యం చూసిన
సర్వ సభికులం మనమని !