8/11/09

ఎందుకు ?



మనిషి మనుగడను అడివి దారిన
మధ్య నిలిచిన ప్రతి చెట్టూ
మిగిలిపోయిన ప్రశ్నై మదిలో
మెదులుతూ ఉంది

బలముంటేనే బ్రతకగలిగిన
నాటి నీతే నమ్ముకుంటే
బట్ట కట్టిన మనిషికింకా
బుద్ధి లేదే ఎందుకు ?

పుడమి కోసం పడతి కోసం
పారిన రక్తపుటేరుల
పరుగుల గమ్యం
ఇంకా తెలియలేదు ఎందుకు ?

మనిషి మీద మనిషి జులుం
బానిసత్వమంటు అరిచి
పోరాడి బావుకుంది మళ్ళీ
డబ్బుకు దాస్యమే అయితే
ఆ చేసిన పోరాటమెందుకు ?
గెలుచుకున్న స్వేచ్ఛెందుకు ?

కళ్ళ ముందే కూలుతున్న
సాటి బ్రతుకుని నిలుపలేని,
కాలుతున్న కడుపు నింప
పట్టెడన్నం పెట్టలేని
కులం కోసం మతం కోసం
కొత్తలోకపు మైకం కోసం సాగే
నిత్య మారణహోమమెందుకు ?

జనం వెతలు తీర్చలేని
ప్రభంజనం ఎందుకు ?
ప్రజల గోడు పట్టని
పిడివాదం ఎందుకు ?
నిజం తీరు మార్చలేని
ఇజం మాత్రం ఎందుకు ?

4 comments:

Manohar Dubbaka said...

Ee prashna samajanee adugutunnava? neeku nuvvu adugukuntunnava?

Samajanni adigee untey matram neeku samadanam radu....kaani oka vishayam cheppali anipistundi.

Ippudu unna janala kee prashna adigey teerikey ledu asalu..unna mana kendukuley anee vadilestunnaru...nuvvu prasninchalinee anukunnavu kabatti...nuvvey diniki samdanam kankuntey ela untundi...?

And enni rojulanee prashanlu adugutamu cheppu...manalnee prashninche varikee samdanam cheppi position lo unnamu ippudu...so let us start discovering the answer for the questions which we have uncovered.

I am sure, once you discover the answer others will follow you. We can't keep asking the questions all the time..it will not lead anywhere...let us start the journey of showing the answers to the society. Let us be the leaders.

వేమన said...

Brother,

First of all I'm glad that this post has raised so many emotions in you. I agree with you.
I'm not posing these questions to anyone, nor am I searching for the answers. My intention was only to portray how every thought process which is intended to be of some use to the society ends up aimless and unfulfilled. May be it's not clear enough :)

Now, there's only one answer to everything, do our bit to uphold what our conscience says is right.
And in this process let's not allow our eyes to be covered by a veil of idealogy, which defeats the purpose.
Be a leader ? Well, that's a trap
we should not fall into :)

Ajit Kumar said...

దామోదరుదు అంటీ పొట్టవరకు వచ్చేంత గొలుసులు / దందలు ధరించిన వాడు అని అర్ధం. అలాగే వీడి పొట్టలో ఎన్ని తెలివితేటలున్నాయి అన్నట్లుగా బ్లాగోదరుడంటే అనేక మంచి బ్లాగులు రచించగలవాడని అన్వ యించుకుందాం .
మీ గేయ రచనా శైలీ, విషయమూ చాలా బాగున్నాయి .నడకలో తూగు కొంచం సరిచేసికోండి

వేమన said...

@ అజిత్ కుమార్ - ధన్యవాదాలు.
ఏదో ఫ్లోలో అలా అనేశాను చూడగానే :)
మీ సూచనకి నెనర్లు.