7/30/09

చేసింది నా మనసు గుల్ల !

కొన్ని నెలలయింది, నే చూడబట్టి,
అయినా ఎందుకో కొత్తే ఇంకా!
కనబడినప్పుడల్లా పిలుద్దాం అనుకుంటాను,
ఈ లోపు ఎవరో వచ్చి చెడగొడతారు.

క్రితం సారి రుచి మరపు రావట్లేదు,
ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరకట్లేదు.
నవ్వుతూ తుళ్ళుతూ ఎక్కడో మాట్లాడుతుందే తప్ప
నా వైపు మాత్రం అసలు రావట్లేదు !

ఏమనుకుంటారో కాదంటేనని,
తలాడించా అడిగిన అందరికీ,
ఈ రోజు మాత్రం ఇలా కుదరదని ,
వేలు చూపించా తన వైపుకి,
'జన్మ ధన్యమైంద'ని ఎందుకంటారో
తెలుసుకున్నా నేనీ దెబ్బకి !

అదే నవ్వుతో మళ్ళీ వచ్చింది,
నేనడిగింది అలాగే ఇచ్చింది,
అసలా చేతిలో ఏం మహిముందోననే
ఆశ్చర్యం నాకు మిగిల్చింది -
చేసిందిలా నా మనసు గుల్ల,
మా లోకల్ కాఫీషాపు పిల్ల !

2 comments:

విశ్వ ప్రేమికుడు said...

కాఫీషాపు పిల్లా...
హ.. హ.. హా...
బాగా రాశారు. :)

వేమన said...

@ ప్రేమికుడు - ధన్యవాదాలు. అదంతా నిజమైన అవేదనేనండీ :)