నిన్నటి నించి నేటి వరకు తెరిపి లేని ఈ పరుగులో
ఎన్ని గడిచిన గుర్తులో - తప్పులో, ఒప్పులో !
అభిప్రాయాల రాతి గోడలు అహమే ఎత్తుగా నిలిచిననాడు,
ఆలొచనల హోరుగాలికి మనసున రేగిన తాటాకు చప్పుడు !
గారడీ మాటల చాటున మాటున నలగక తప్పని నిజపు ఛాయలు
కొద్దో గొప్పో కలిగిన జాలికి హద్దులు పెట్టిన స్వార్ధపు జాడలు.
అస్థిత్వపు అనందం ఉనికి వెతికిన దొరకని మనోవనంలో
అడగకనే పూచిన కాగితం పువ్వులు - ఆ పై పై చిరునవ్వులు!
ఐతే మాత్రం -
పలకరించిన ప్రతి ముఖంలో తొంగి చూసిన ఆ 'స్వ'భావం,
అక్కడక్కడా అమాయకత్వం, ఆశే ఎరుగని చిలిపిదనం,
అలసిపోయి అడిగినవాడికి గ్రుక్కెడు నీళ్ళు ఇచ్చే మంచితనం,
మారిన కాలపు నడకేమవనీ, ఇంకా ఇవన్నీ మిగిలున్న వైనం,
జీవిత గమనం సాగించేందుకు నింపెను నాలో కొత్త ఉత్సాహం !
7/28/09
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
బాగుంది
కొత్తపాళీగారూ, స్వాగతం.
Thanks for the comment.
iyite matramnunchi chalaa bagundi.
@ సుభద్ర - ధన్యవాదాలు...
మరీ అంతా పాజిటివ్ గా రాయలేనండీ, అది నా బలహీనత :)
Post a Comment