10/13/09

మీనామోహనం

(ఉష గారి జలపుష్పాభిషేకానికి)

కనులు తెరిచే నీవు నిద్దరోతావంట
వినడమేగానీ నే చూడలేదెన్నడూ
రెప్పలు బరువైనా కంట నీరొలికినా
నేల బుట్టిన జీవులం మాకు తప్ప
నీటిలో కొలువైన నీకు లేదెప్పుడూ

తాను మలిచిన సృష్టి వైనమంతటినీ
ఒడిసి పట్టిన నీ రెండు కళ్ళు చూసి
నిన్నూ మలిచిన బ్రహ్మ తానె మురిసి
మూడొంతుల భూమి నీ ఇల్లు జేసె.

అంత గారమనేమో ఎగిరెగిరి పడతావు
ఒడ్డునున్న మాపై ఒక చూపు విసురుతావు
మా లోకంలోకి నువ్వలా తొంగి చూసిన వేళ
ఆనందం ఆశ్చర్యం కొట్టుకొచ్చే కళ్ళ
పిల్లకాయల ఆగని అరుపులు కేరింతలే
నీ వన్నె చిన్నెలకు సాటంటూ ఉంటే !

6 comments:

మరువం ఉష said...

సంతోషం, లింక్ కలుపుతాను కానీ ఒక ప్రశ్న, అంత చక్కని భావానికి ఎందుకా శీర్షిక పెట్టారు. "మీనమా నీ నయనమా, లోక సందర్శనమా ..." అని కాస్త ఆశ్చర్యార్థకమౌ పదాన్ని కూర్చకుండా?

"మూడొంతుల భూమి నీ ఇల్లు జేసె" "ఎగిరెగిరి పడతావు
ఒడ్డునున్న మాపై ఒక చూపు విసురుతావు" బాగుందండి, మీన నయ గారాలు వెదికి పట్టి తెచ్చారుగా?

వేమన said...

హ హ హ
అదేంలేదండీ, అది placeholder అంతే, టైటిల్ గురించి అలొచించేంత సమయం లేక :)
ఇప్పుడు మార్చాను చూడండి.

మరువం ఉష said...
This comment has been removed by the author.
మరువం ఉష said...

శీర్షిక మార్చినందుకు సంతోషం. ఇప్పుడు మన్మోహనంగా వుంది. కవిత అందం కొట్టొచ్చినట్లుగా వుంది. లింక్ కలిపాను.

జలపుష్పాభిషేకం మహా జోరుగా వుంది.

Check it out at:

http://maruvam.blogspot.com/2009/10/blog-post.html

భావన said...

చాలా బాగుందండీ... నిజం గానె మీనాలు అలానే అనుకుంటాయేమో...

వేమన said...

ఉష గారు, పరిమళంగారు, భావనగారు...నెనర్లు !