9/8/09

కలత నిద్ర



గుర్తు తెలియని దృశ్యాలేవో కొట్టుకుంటున్న అలికిడికి
ఉన్నట్టుండి రెప్పల తలుపులు తెరుచుకున్నాయి.

ఆపకుండా సుళ్ళు తిరిగిన చెవిలోని శబ్దాలన్నీ
తెరుచుకున్న కళ్ళలోంచి జారుకున్నాయి.

లేని పోని ఊహల్లో రేయంతా ఊయలూగిన మనసు
శరీరపు పంజరంలో తిరిగి బందీ అయింది.

తను అలసిపోయి సోలిన వేళ మనసు చేసిన అల్లరికి
రోజంతా ఒళ్ళు ఇప్పుడు పగ తీర్చుకుంటోంది.

రెంటి బాధా తెలిసీ, నేనెవరో తెలియక
సంధి కోసం మౌనంగా ఎదురు చూస్తున్నాను

3 comments:

భాస్కర రామిరెడ్డి said...

బాగుంది వేమన గారు.

Padmarpita said...

బాగు..బాగు!

వేమన said...

భా.రా.రె, పద్మార్పిత గారూ, ధన్యవాదాలు.