నిశబ్ద జలపాతపు
ఎడతెగని హోరు
నన్నా వైపుగా ఈడ్చుకెళ్ళింది,
ఎందుకైతేనేం !
కొన్ని లిప్తల
అస్తమయంలో
అంతులేని ప్రశాంతత
అనుభవించేలోపే
తటాలుమని ఓ తలపు
వేయి ముక్కలై
అక్కడక్కడే తచ్చాడి
తిరిగి మౌనంలోకి
జారిపోజూస్తాను
ఆలసిపోతూ
ఓ అనుభవాన్నై
ఆగిపోయినపుడు అక్షరాన్నై,
కరిగిపోయే కాలపు
కొవ్వొత్తి అడుగున
మైనపు చుక్కనై
మిగులుతాను !