12/2/09

నోస్టాల్జియా



కనిపించే ప్రతి అందాన్నీ
బంధించబోయిన
చూపుల తాళ్ళని తెంపుకుంటూ
బండి తరలిపోతోంది
నా ఆనందం ఇంధనంగా
స్మృతుల ధూమం, సాక్షిగా !

ఉన్నపాటున అగితే ఎంత బావుణ్ణో
మొదటినించీ వస్తే, అంతకన్నా !
ఎందుకో మరి - పయనమాగదు,
ఆశ చావదు !

అక్కడే ఆగడం సృష్టి ధర్మం కాదో
మళ్ళీ మొదలంటే అర్ధమే ఉండదో
పయనం ఎందుకో, గమ్యం ఏమిటో
అన్న తలపుల ఆటుపోట్లకి
మదిలో ఎగసే అలలని,
రెప్పలు వాల్చేసి ఇలా
కప్పేయజూస్తాను.

2 comments:

Manohar Dubbaka said...

Dude, poem baga rasavu telugulo,,,maree title enti ala englishlo pettavu?

నిషిగంధ said...

"ఉన్నపాటున అగితే ఎంత బావుణ్ణో
మొదటినించీ వస్తే, అంతకన్నా !"
...
"మదిలో ఎగసే అలలని,
రెప్పలు వాల్చేసి ఇలా
కప్పేయజూస్తాను."

చాలా బావుందండీ! మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నాను.. ఒక్కొక్కటీ చదవాలి ఇంకా :-)