11/4/09

శరత్ రాగాలు




నిన్న, నేడు, రేఫు ఆగని పరుగులో
అపుడపుడూ దొరికే ఆనందపు జాడకై
ఆరుబయిటకి నేను చూపు సారించాను.

అలవాటుగా తనపాటున మేలుకున్న సూరీడు
ఆకసపు వాకిట్లో ఎర్రటి ముగ్గేసి
పొగమంచు చుట్టాన్ని పలకరించాడు.

పనిపాట ఎరుగని పిల్లగాలులన్నీ
చెట్టు చుట్టూ చేరి చెంగు
చెంగున చిందులేసాయి.

పిల్లగాలుల అల్లరికి పులకించిన చెట్టు
రాలిపోయే ఆకులకు రంగులద్ది మరీ
తోడిచ్చి పంపింది.

బ్రతుకు బండిలో తరలిపోతున్న నన్ను చూసి,
ప్రకృతి పాప ఒక నవ్వు నవ్వింది,
మళ్ళీ మజిలీవరకూ నిలిచిపోయే
చిన్న మాయ చేసి !

3 comments:

రవిచంద్ర said...

చాలా బాగుందండీ కవిత...

సుభద్ర said...

చాలా చాలా బాగు౦ది..

వేమన said...

రవిచంద్ర, సుభద్రగారూ - నెనర్లు !