6/23/08

సముద్రం

ఏదో సాధించాలనే తపన నిండిన ఆలోచనల లాంటి అలలు.. ఇంత లోనే అంతర్మధనం ... వెనక్కి వెళ్ళడం.. మళ్ళీ కమ్ముకుని ఎగసి పడడం ....... సమయం తెలియనివ్వని , ఎడతెగని ఘోష .. అస్తమించే సూర్యుడు.. కాళ్ళ కింద మెత్తటి ఇసక..... ఉండి ఉండి దానిని తడిపే నీటి నురగ.. సముద్రం అంటే ఒక మహొన్నతమైన అనుభవం..ఆవిష్కారం..
ప్రకృతి తన అనంతమైన శక్తిని నిరంతరంగా ప్రదర్శించే వేదిక సముద్రం..
ప్రపంచంలో జరిగే ప్రతి పరిణామాన్ని ఏదో ఒక లాగా వివరించేసి చేతులు దులుపుకునే ఆధునిక జాడ్యం అంటని ప్యూర్ మైండ్ కి సముద్రాన్ని చూడగానే కలిగే మొదటి ప్రశ్న...

ప్రకృతికి ఇంత శక్తి ఎక్కడిది ? అసలు సముద్రాలూ, పర్వతాలు, నదులు, అడవులు... ఇవన్ని ఎవరు సృష్టించారు. ?
ఎందుకు సృష్టించారు ? దేవుడు అంటే ఆ సృష్టించిన వాడేనా ? ప్రకృతి శక్తి తో పోల్చుకుంటే మనిషి శక్తి ఏ పాటిది ?
అలాంటప్పుడు ప్రకృతికి తల వంచి బతకాలా ? లేక ఎదిరించి పోరాడాలా ?

No comments: