మనం కలిసే ప్రతి మనిషిలో మన లక్షణాలు ఒకటో రెండో.. కనిపించడం... ఎక్కువగా అవి మనలో మనకే నచ్చనివిగా ఉండడం...
ఒకప్పుడు మనం చేసిన పనులు.. ఆ సమయంలో ఎంత సబబుగా కనిపించాయో... ఇప్పుడు అంత కంటే తప్పుగా అనిపించడం...
ఒకప్పుడు ఎంతో ముఖ్యంగా అనిపించిన విషయాలు.. ఇప్పుడు చిన్నవిగా కనిపించడం...
7/2/08
6/23/08
సముద్రం
ఏదో సాధించాలనే తపన నిండిన ఆలోచనల లాంటి అలలు.. ఇంత లోనే అంతర్మధనం ... వెనక్కి వెళ్ళడం.. మళ్ళీ కమ్ముకుని ఎగసి పడడం ....... సమయం తెలియనివ్వని , ఎడతెగని ఘోష .. అస్తమించే సూర్యుడు.. కాళ్ళ కింద మెత్తటి ఇసక..... ఉండి ఉండి దానిని తడిపే నీటి నురగ.. సముద్రం అంటే ఒక మహొన్నతమైన అనుభవం..ఆవిష్కారం..
ప్రకృతి తన అనంతమైన శక్తిని నిరంతరంగా ప్రదర్శించే వేదిక సముద్రం..
ప్రపంచంలో జరిగే ప్రతి పరిణామాన్ని ఏదో ఒక లాగా వివరించేసి చేతులు దులుపుకునే ఆధునిక జాడ్యం అంటని ప్యూర్ మైండ్ కి సముద్రాన్ని చూడగానే కలిగే మొదటి ప్రశ్న...
ప్రకృతికి ఇంత శక్తి ఎక్కడిది ? అసలు సముద్రాలూ, పర్వతాలు, నదులు, అడవులు... ఇవన్ని ఎవరు సృష్టించారు. ?
ఎందుకు సృష్టించారు ? దేవుడు అంటే ఆ సృష్టించిన వాడేనా ? ప్రకృతి శక్తి తో పోల్చుకుంటే మనిషి శక్తి ఏ పాటిది ?
అలాంటప్పుడు ప్రకృతికి తల వంచి బతకాలా ? లేక ఎదిరించి పోరాడాలా ?

వర్గాలు:
ఆలోచనలు
6/22/08
తెలుగు వాడు గర్వపడే వేళ....
తెలుగు వాళ్ళు నిజంగానే గర్వ పడాలి.... ప్రాచీనత సంగతి సరే... ఈ రోజుల్లో కూడా... ఎందుకంటే...
ఆత్రేయ...
" అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని..
జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని.."
" గురుతు చెరిపి వేసి జీవించాలని... చెరపలేకపోతే మరణించాలని..
తెలిసి కూడా చెయ్యలేని వెర్రి వాడిని..గుండె పగిలి పోవు వరకు నన్ను పాడనీ..
ముక్కల లో లెక్కలేని రూపాలలో .. మరల మరల నిన్ను చూసి రోదించనీ..."
వేటూరి...
" పదములు తామే ... పెదవులు కాగా.. గుండియలే...అందియలై... మ్రోగ...."
సిరివెన్నెల...
" అలల పెదవులతో.. శిలల చెక్కిలి ఫై.. కడలి ముద్దిడు వేళ...
పుడమి హృదయంలో...
ఉప్పొంగి సాగింది అనురాగము... ఉప్పెనగ మారింది ఆ రాగము..."
ఇవి వీళ్ళ బెస్ట్ వర్క్స్ కావు.. మచ్చుక్కి.. నేను ఎంచినవి .. ఏది తీసుకున్నా ఒక స్థాయి కి తగ్గకుండా ఉండడం చాలా గొప్ప విషయం...తెలుగు సినిమా సాహిత్యానికి ఒక గౌరవాన్ని చిర స్థాయిగా సంపాదించి పెట్టిన వాళ్ళందరినీ చూసి మనం నిజంగానే గర్వపడాలి...ఎందుకంటే... ఇవాల్టి రోజున.. సినిమా అనేది.. సగటు మనిషి దృష్టిలో
ఆ భాష సాహిత్యానికి కొలబద్ద.

అభిప్రాయాలు,
ఆలోచనలు
6/19/08
సభకు నమస్కారం
టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టి తెలుగు లో రాస్తున్నాను అనుకోకండి - ఇది నాకు ఇప్పుడే తెలిసింది...
పెన్ తో తెలుగు రాయక సంవత్సరాలు ఐంది.. కానీ కనీసం టైపు చేస్తున్నందుకు చాలా సంతోషం
ఇక పోతే.. ఇంగ్లీష్ లో రాయడానికి ఒక బ్లాగ్ ఉండనే ఉంది కాబట్టి.. ఈ బ్లాగ్ తెలుగులో రాయడానికి నిర్ణయించాను.
నాకు ఈ మధ్యనే అర్ధం ఐంది.. బ్లాగ్ రాయాలంటే చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అని...ఎంత అంటే...
తెలుగు బ్లాగు లో ఒక రెండు ఇంగ్లీష్ ముక్కలు ఉన్నా ఫర్వాలేదు అని అనుకునేంత...
అద్దం లో చూసినప్పుడు మన మొహం మాత్రమే కాక వేరేవి కూడా కనిపించేంత ..
చిన్న చిన్న చికాకులకీ పెద్ద పెద్ద కష్టాలకీ తేడా గుర్తించేంత ....
మనం చెప్పేది నచ్చని జనాలు కూడా ఉంటారు అని తెలుసుకునేంత...

Subscribe to:
Posts (Atom)