చేతి గొడుగులా పట్టి ఉంచిన దాన్ని
సడలించి చూస్తాను ఎటు లాక్కు పోతుందో
ఎగిరేటి గువ్వల జత బాటసారినై
తరలిపోవచ్చేమో, నచ్చిన తీరానికి
నిశ్చల సరోవరమైనా
నీడలు కదులుతాయి
నీడ చీల్చుకు చూడు
నిజం కనబడుతుంది
నిజం తెలిసిన నాడు తేడా ఏముంది ?
సరస్సైనా,
సాగరమైనా !
దిగంతాల స్వేచ్ఛ , కొన్ని నిట్టూర్పులు
అనంతమైన వెలుగు, కొన్ని అవమానాలు
స్వాతి చినుకులు, కొన్ని కన్నీటి చుక్కలు
ఇంద్రధనసులు, మరి కొన్ని భంగపాట్లు
భరించేదేముంది, అంతకన్నా ?
8/13/10
Subscribe to:
Posts (Atom)